విధులకు డుమ్మా కొట్టి వన భోజనాలకు వెళ్లిన ICDS సిబ్బందిపై సూర్యాపేట కలెక్టర్ సస్పెన్షన్‌తోపాటు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సూర్యాపేట అర్బన్ ప్రాజెక్టులోని ఓ సెక్టార్‌కు చెందిన అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, టీచర్లు, ఆయాలు కలిసి సీడీపీఓ కమలప్రియ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకొని మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో చివ్వెంల మండలం బీబీగూడెం శివారులోని ఓ మామిడితోటలో కార్తీకమాస వన భోజనాలు చేసుకున్నారు.

విందు భోజనాలు చేసి ఆడిపాడారు. ఇదే సమయంలో వారిలో వారు సరదాగా తీసుకున్న వీడియోలు వాట్సాప్‌లలో తిరగడడంతో మూకుమ్మడిగా ఓ సెక్టార్‌కు చెందిన ఐసీడీఎస్ సిబ్బంది మొత్తం వన భోజనాలకు వెళ్లినట్లు అధికారుల దృష్టికి వెళ్లింది. ఈ విందులో సీడీపీఓ కూడా పాల్గొన్నట్లు అధికారులు గుర్తించి కలెక్టర్‌కు నివేదించగా

కలెక్టర్ డి.అమయ్‌కుమార్ ప్రాథమిక విచారణ చేపట్టి సీడీపీఓ కమలప్రియను సస్పెండ్ చేస్తూ ఉత్తర్తులు జారీ చేశారు. అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు…