కాలేజీలో చదివే విద్యార్థునుల పట్ట అసభ్యకరంగా ప్రవర్తిస్తు లైగింక వేధింపులకు పాల్పడుతున్న ప్రవైట్‌ జూనియర్‌ కళాశాల లెక్చరర్‌ను ఆదివారం షీ టీం బృందం అరెస్టు చేసిసట్లుగా వరంగల్‌ కమీషనరేట్‌ క్రైం ఎ.సి.పి తెలిపారు.

ఈ అరెస్టు సంబంధించి పోలీస్‌ కమిషనర్‌ వివరాలను వెల్లడిస్తూ ములుగు జిల్లా, ఇంచర్ల గ్రామానికి చెందిన తోంబురపు రంజిత్‌ కుమార్‌ గత కోద్ది కాలంగా హన్మకోండ ప్రాంతంలోని ప్రముఖ జూనియర్‌ కాలేజ్‌ లో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుడు రంజిత్‌ గత కోద్ది రోజులుగా తన తరగతిలో చదువులో వెనకబడివున్న విధ్యార్థునులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులను నిర్వహిస్తానని విధ్యార్థునులను మభ్యపెట్టి వారికి తన వ్యక్తిగత సెల్‌నెంబర్‌ అందజేసేవాడు. ఇలా సెల్‌నెంబర్‌ ఇచ్చిన విధ్యార్థినులతో సదరు లెక్చరర్‌ వారితో మాటలు కలిపి రోజులు గడిచిన అనంతరం విధ్యార్థునులకు నిందితుడు లెక్చరర్‌ వాట్సప్‌ లేదా ఎస్‌.యం.ఎస్‌ ద్వారా అసభ్యకరమైన సందేశాలతో పాటు చిత్రాలను పోస్ట్‌ చేయడంతో పాటు లైంగికముగా వేధింపసాగేను.

ప్రత్యేక తరగతుల పేరుతో లైంగిక వేధింపులు గురవుతున్న విధ్యార్థునుల్లో ఒకరు కాలేజీ లెక్చరర్‌ వ్యవహరశైలిని తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకపోవడంతో అప్రమత్తమైన తల్లిదండ్రులు తక్షణమే వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వాట్సప్‌ నెంబర్‌కు పిర్యాదు చేయడంతో, పోలీస్‌ కమిషనర్‌ డా.వి.రవీందర్‌ అదేశాల మేరకు, షీ టీం ఇన్స్‌స్పెక్టర్‌ బి.శ్రీనివాస్‌ తన సిబ్బంది హెడ్‌ కానిస్టేబుల్‌ బ్షిక్యూ నాయక్‌, కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌, నరేందర్‌ మహిళా కానిస్టేబుల్‌ లక్ష్మీతో కల్సి విధ్యార్థునులను వేధింపు గురిచేస్తున్న లెక్చరర్‌ పనిచేస్తున్న కళాశాలకు వెళ్ళి క్షేత్ర స్థాయిలో షీ టీం అధికారులు, సిబ్బంది విధ్యార్థునులు, తోటి లెక్చరర్లను విచారించడంతో నిందితుడు విధ్యార్థునుల పట్ల అసభ్యకరంగా వ్యవహరించడంతో పాటు, లైంగికంగా వేధిస్తున్నట్లుగా నిర్థారణ కావడంతో షీ టీం విభాగం పోలీసు సదరు కీచక లెక్చరర్‌పై హన్మకోండ పోలీస్‌ స్టేషన్‌నందు కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది.

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు, మహిళలు, విధ్యార్థునుల పట్ల ఆసభ్యకరంగా ప్రవర్తించిన లేదా లైంగిక వేధింపులకు గురిచేస్తున్న భాధితులు మౌనంతో వుండకుండా తక్షణమే వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వాట్సప్‌ నెంబర్‌ 9491089257కు ఫిర్యాదు చేసిన లేదా షీ టీం ఇన్స్‌స్పెక్టర్‌ 7382294058 నంబర్‌కు సమాచారం అందించిన సదరు నిందితులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని క్రైమ్‌ ఎ.సి.పి తెలిపారు.