వరంగల్: విలీన గ్రామాల్లో గుర్తించిన అభివృద్ధి పనులకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అధికారులను ఆదేశించారు. గురువారం వర్ధన్నపేట నియోజకవర్గంలో ని 46, 55 డివిజన్లలో చేపట్టనున్న అభివృద్ధి పనులను క్షేత్ర స్థాయిలో అధికారులతో ఆయా స్థలాలను పరిశీలించారు. 46, 55 డివిజన్లలో కేయు పోలీస్ స్టేషన్ ఎదురుగా కరీంనగర్ రోడ్ నుండి భిమారం రోడ్ కు అప్రోచ్ రోడ్ ప్రతిపాదనలు వెంటనే సిద్దం చేయాలన్నారు.

భిమారం జంక్షన్ ను వారు పరిశీలించి జంక్షన్ అభివృద్ధి, సుందరికారణ పనులు తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ: కొనసాగుతున్న అభివృద్ధి పనులలో వేగం పెంచాలన్నారు. అను నిత్యం గుత్తేదారుల వెంట పడీ పనులు గడువులోగా పూర్తి చేయాలన్నారు. బల్దియా డి ఈ లు సంతోష్ బాబు, రవి కిరణ్, ఏఈ హరికుమార్, శ్రీకాంత్ లు తదితరులు పాల్గొన్నారు.