వ్యవసాయశాఖలో ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వివాహిత అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం తిపటూరు తాలూకాలో చోటు చేసుకుంది. తిపటూరు పట్టణానికి చెందిన దివ్య (25)భర్త, రెండేళ్ల బాబుతో కలసి కుణిగల్‌రోడ్‌లో నివాసం ఉంటోంది. పట్టణంలోని వ్యవసాయశాఖలో ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న దివ్య రోజువారీలాగానే సోమవారం కూడా విధులకు హాజరయ్యారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం ఐదు గంటలకు శౌచాలయానికి వెళ్లిన దివ్య ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సహోద్యోగులు పరిశీలించగా శౌచాలయంలో విషం తాగిన దివ్య విగతజీవిగా పడి ఉంది. తిపటూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.