హుబ్లీ: వివాహేతర సంబంధం హత్యకు దారితీసిన ఘటన జిల్లాలోని కలఘటికి తాలూకా కురివినకొప్ప గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు గ్రామానికి చెందిన వివాహిత మహిళ ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తోంది. పక్క గ్రామానికి చెందిన ఆటో నిర్వాహకుడు మంజునాథ్ మరప్పనవర్ ఆటోలో ఆమె ప్రయాణించేది. ఈ క్రమంలో ఇద్దరికి పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. అనైతిక సంబంధాలు తగదని ఆ మహిళ అన్న బసవరాజ కురడికేరి మంజునాథ్‌కు పలుసార్లు హెచ్చరికలు జారి చేశారు.
అయినా పట్టించుకోలేదు, దీంతో బసవరాజ్ తన చెల్లెలితోనే ఫోన్ చేయించి మంజునాథ్‌ను పిలిపించి ఈ నెల 18న రాళ్లు, మారణాయుధాలతో కొట్టి చంపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు.