శిడ్లఘట్ట: పట్టణంలోని మారమ్మ దేవాలయం సర్కిల్‌లో నివాసం ఉంటున్న రాజేశ్వరి (35) అనే మహిళ మంగళవారం ఉరి వేసుకున్న స్థితిలో అనుమానాస్పదంగా మరణించింది. ఆమెకు భర్త వెంకటేష్‌తో పాటు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కూలి పనులు చేసుకుంటూ బాడుగ ఇంట్లో ఉంటున్నారు. కర్ణాటక శిడ్లఘట్టలోనే ట్రాఫిక్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేసే అనంత్‌కుమార్‌–రాజేశ్వరి మధ్య 4 ఏళ్ల నుంచి అక్రమ సంబంధం కొనసాగుతోంది.

ఈ నెల 21వ తేదీన ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. ఇంతలోనే రాజేశ్వరి అనూహ్యంగా శవమైంది. తన భార్యను అనంత్‌ కుమారే హత్య చేశాడని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు అనంత్‌కుమార్‌ పరారీలో ఉన్నాడు. దోషుల్ని శిక్షించి ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.