గతకొన్ని రోజుల క్రితం కిడ్నాప్‌ డ్రామా ఆడిన ఘట్‌కేసర్‌ బీ ఫార్మసీ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం సృష్టిస్తోంది. షుగర్‌ ట్యాబెట్లు మింగి సూసైడ్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒకేసారి ఎక్కువ మోతాదులో ట్యాబెట్లు మింగడంతో యువతి మరణించిందని సమాచారం. యువతి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా10 రోజుల క్రితం తనపై హత్యాచార యత్నం చేశారంటూ బీఫార్మసీ విద్యార్థిని చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. పోలీసుల విచారణ అనంతరం అసలు ఆ అమ్మాయిని ఎవరు కిడ్నాప్‌ చేయలేదని, హత్యాచార యత్నం కూడా జరగలేదని తెలిపారు..