తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కరోనాను కట్టడి చేయడానికి ఎంతగానో శ్రమించి కీలకంగా వ్యవహరించిన పోలీసులు, కరోనా వైరస్‌పై పోరు చేస్తున్న వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకుతోంది. ఇప్పటి వరకు ఎంతో మంది తెలంగాణ పోలీసులు కరోనా బారిన పడుతున్నారు. మొన్నటికి మొన్న ఓ కానిస్టేబుల్ కరోనాతో మృతిచెందిన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌లోని కాలాపత్తర్ పోలీసు స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న యూసుఫ్(47) కోవిడ్ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందారు. యూసుఫ్ 20 రోజుల క్రితమే కాలాపత్తర్ పీఎస్‌లో ఏఎస్ఐగా చేరారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన గత వారం రోజుల క్రితం కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. దీంతో యూసుఫ్ హైదరాబాద్ నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం చనిపోయాడు. అయితే ఇప్పటికే ఓ వైద్యుడు సైతం కరోనా వైరస్‌తో మరణించిన సంగతి తెలిసిందే.