నిర్మల్‌ జిల్లాలోని తనూర్‌ మండలం సింగన్ గావ్ గ్రామంలో విషాదం చోటు చోసుకుంది. చెరువులో ముగ్గురు బాలికల మృతదేహాలు లభ్యమ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతులను సునీత(16), వైశాలి(14), అంజలి(14)గా గుర్తించారు. సునీత , వైశాలి అక్కచెల్లెలు కాగా, అంజలి వీరి సమీప బంధువు. కాగా, ఆదివారం సాయంత్రం అదృశ్యమైన ఈ ముగ్గురు బాలికలు మృత్యువాత పడటంతో ఈ ఘటన ప్రమాదమా ? లేదా హత్యలా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేపట్టారు. బాలికల మృతితో వారి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.