ఇది రియల్ ఇన్సిడెంట్ అంటున్నారు వైద్యులు. ఇంతకీ ఏమైంది అనుకుంటున్నారా ? జాయిస్‌ విన్సెంట్‌ అనే మహిళ ఇలా విచిత్రమైన రీతిలో మృతి చెందింది. తన కుటుంబ సభ్యులకు, మిత్రులకు దూరంగా ఉంటున్న ఆమె మృతి ఇప్పటికే ఒక హిస్టరీగానే మిగిలిపోయింది. వివరాల్లోకి వెళ్లితే: వినెట్స్ అనే మహిళ ఒంటరిగా ఎవరితో పరిచయాలు లేకుండా ఉండేది. దీంతో ఆమె వద్దకు చుట్టుపక్కల వారు, చుట్టాలు ఎవరూ వచ్చే వారు కాదు. ఒంటరిగా ఉండే తాను ఎక్కువగా టీవీ చూడటానికి ఆసక్తి చూపేది.

ఈ క్రమంలో ఒకరోజు చేతిలో రిమోట్ పట్టుకొని టీవీ చూస్తున్న ఆమె ఆకస్మికంగా మృతి చెందింది. చనిపోయిన మూడు సంవత్సరాలకు రూమ్ వద్దకు వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని ఘటన ఎదురైంది. కుర్చీలో రిమోట్ పట్టుకొని, అస్థిపంజరం దర్శనం ఇచ్చింది. అయితే ఇందులో ఇంకో ఆశ్చర్యకరమైన సంఘటన ఏమిటంటే ఆమె చనిపోయి అస్థిపంజరంగా మారినా ఆ టీవీ మాత్రం నడుస్తూనే ఉంది. దీంతో ఆ ప్రదేశానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం ఆమె ఎలా చనిపోయిందని పరిశీలన చేస్తున్నా ఆ డెత్ మిస్టరీ ఇంక వీడలేదు. దీంతో ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన ఇప్పటికీ అంతుచిక్కని రహస్య మరణంగా మిగిలిపోయింది.