ప్రేమలు ,పెళ్లిళ్లు, నిశ్చితార్దాలు అన్నీ ఆన్ లైన్ లోనే జరిపేసే కాలమిది, వక్తిగత సంబంధాలు , ఆన్ లైన్ సంబంధాలుగా ఎలా మారిపోతున్నాయి చూడండి

గుజరాత్‌కు చెందిన రెండు కుటుంబాలు తమ పిల్లలకి భారతీయ సాంప్రదాయ పద్దతిలో వివాహం చేయాలనుకున్నారు. దీనిలో భాగంగా నిశ్చితార్థ వేడుకకి ఒక తేదిని కూడా ఫిక్స్‌ చేశారు. కానీ వేరు, వేరు దేశాల్లో ఉన్నా అమ్మాయి, అబ్బాయి ఆ తేది నాటికి గుజరాత్‌ రాలేకపోయారు.
దీంతో పెద్దలు వారికి ఆన్‌లైన్‌లోనే నిశ్చితార్థ కార్యక్రమాన్ని జరిపారు. వాట్సాప్‌ ద్వారా వధూవరులకు వీడియో కాల్‌ చేశారు.

అనంతరం రెండు ఫోన్‌లను పీటలపై ఉంచి ఆన్‌లైన్‌లోకి వచ్చిన అమ్మాయి, అబ్బాయికి తిలకం పెట్టారు. వస్త్రాలను కూడా వారికి చూపించి ఫోన్‌ వెనుకాల ఉంచారు. అనంతరం ఇంటి పెద్దలు అంతా అక్షింతలు వేసి ఆన్‌లైన్‌లోనే వారిని ఆశీర్వదించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. టెక్నాలజీని ఇలా కూడా వాడుకుంటున్నారా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.