ఉరి అమలు తేదీ దగ్గరపడుతుండడంతో నిర్భయ దోషులు శిక్ష తప్పించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నలుగురు దోషుల్లో ఒకడైన ముకేశ్‌ సింగ్‌ తాజాగా ఢిల్లీ కోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశాడు. నిర్భయ అత్యాచార ఘటన జరిగిన డిసెంబరు 16న తాను ఢిల్లీలోనే లేనని పిటిషన్‌లో చెప్పుకొచ్చాడు. డిసెంబర్‌ 17, 2012న రాజస్థాన్‌ నుంచి పోలీసులు తనని ఢిల్లీ తీసుకొచ్చారని పేర్కొన్నాడు. తిహాడ్‌ జైలులో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో తనకు మరణశిక్ష రద్దు చేయాలని కోరాడు. ఈ మేరకు ఢిల్లీలోని పటియాలా హౌజ్‌ కోర్టు అడిషనల్‌ సెషన్స్‌ న్యాయమూర్తి ధర్మేంద్ర రాణా ముందు తన పిటిషన్‌ని ఉంచాడు.