పిచ్చిపట్టి రోడ్డున పడ్డాడు !! అమ్మాయి వెంట పడ్డాడు !!

కన్నడ సినీ హీరో, నిర్మాత హుచ్చ వెంకట్‌ ఇటీవలే సకలేశపుర, కొడగు, మైసూరు తదితర ప్రదేశాల్లో పబ్లిక్‌గా పిచ్చిపిచ్చిగా ప్రవర్తించి స్థానికులతో గొడవపడి చావు దెబ్బలుతిని వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం అదే హుచ్చా వెంకట్‌ హిందూపురం–యలహంక రహదారి మార్గంలోని మారసంద్ర టోల్‌ వద్ద వీరంగం సష్టించాడు.

దొడ్డబళ్లాపురం మీదుగా టోల్‌ వద్దకు వచ్చిన వెంకట్‌ అక్కడే తన కారు నిలిపి టోల్‌ వద్ద బస్సు కోసం వేచి చూస్తున్న కాలేజ్‌ అమ్మాయి దగ్గరకు వెళ్లి తనను ప్రేమించమని,పెళ్లి చేసుకోమని వెంటపడ్డాడు.అమ్మాయి భయంతో అక్కడి నుండి పరుగులు తీసింది.తరువాత వెంకట్‌ తన కారు అద్దాలను తనే రాళ్లతో పగలగొట్టుకున్నాడు.స్థానికులపై అరిచాడు.

అంతలో సమాచారం అందుకున్న రాజానుకుంట పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని హుచ్చ వెంకట్‌ను స్టేషన్‌కు తరలించారు.