ఖానాపూర్ మండ లం బుధరావు పేట గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు షేక్ హుస్సేన్- యాకుభిలు సోమ వారం రోజున జాతీయ రహదారి పక్కన గల ఆర్టీసీ బస్ షెల్టర్లో వున్నట్లు సమాచారం అందుకున్న ఖానాపూర్ ఎస్పై సాయిబాబు మంగళవారం గ్రామానికి వెళ్లి వృద్ధ దంపతులకు వారి కుమారులకు కౌన్సిలింగ్ నిర్వహించడం తోపాటు బియ్యం కూరగాయలను దంపతులకు అందించారు. హుస్సేన్, బి-యకోబిల కోరిక మేరకు వారి పెద్ద కుమారుడైన సర్వర్ ఇంటికి పంపించారు. తల్లి దండ్రులను ప్రేమగా చూసు కోవాలని వారి కుమారులకు సూచించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు పోలీసులు వృద్ధ దంపతులను తిరిగి వారిని ఇంటికి చేర్చడంలో చోరవ చూపిన ఎస్ ఐ తో పాటు , ఎ ఎస్ ఐ వేణుగోపాల్ రెడ్డి ల పట్ల బుధరావు పేట గ్రామస్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేసారు .