ప్ర‌ముఖ హాస్య‌న‌టుడు వేణుమాధ‌వ్ ఆరోగ్య ప‌రిస్థితి విషమంగా ఉంద‌ని తెలుస్తోంది. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న కాలేయ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్నారు. ఇటీవ‌ల ఆయ‌న హైద‌రాబాద్‌లోని య‌శోద ఆసుప‌త్రిలో చేరారు. అక్క‌డ ఆయ‌న‌కు కిడ్నీ స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. ప్ర‌స్తుతం వెంటిలేట‌ర్ స‌హాయంతో చికిత్స అందిస్తున్నారు. ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. దాదాపు 600 చిత్రాలలో వివిధ పాత్ర‌ల‌తో అల‌రించాడు వేణుమాధ‌వ్‌. హీరోగానూ చేశారు. నిర్మాత‌గానూ సినిమాలు తీశారు…