అప్పులు, అధిక వడ్డీలు భరించలేక నిజామాబాద్‌ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన కేసులో సూసైడ్‌ లెటర్‌ వెలుగులోకి వచ్చింది. ‘మా కుటుంబం చావుకు ఆ నలుగురే కారణమంటూ గణేష్‌కుమార్‌, వినీత, చంద్రశేఖర్‌, సాయి రామ మనోహర్‌ పేర్లను సూసైడ్‌ లెటర్‌లో రాశారు. మా కుటుంబం చావుకు కారణమైన ఈ నలుగురిని కఠినంగా శిక్షించాలంటూ లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఘటనపై మృతుడు సురేష్‌ బావమరిది రాంప్రసాద్‌ మాట్లాడుతూ:

మా అక్క, బావ, ఇద్దరు కుమారులు సూసైడ్‌ చేసుకోవడానికి ఆ నలుగురే కారణం. వారి వడ్డీ వేధింపుల వలనే విజయవాడ వచ్చి సూసైడ్‌ చేసుకున్నారు. ఆ నలుగురు అధిక వడ్డీలు వసూలు చేశారు. డబ్బులు కట్టకపోతే అంతుచూస్తామని బెదిరించారు. సూసైడ్‌నోట్‌లో ఇదే విషయాన్ని రాశారు. వాళ్లు చనిపోయేముందు కూడా సెల్ఫీ వీడియో తీసుకున్నారు. మొత్తం సమాచారం పోలీసుల వద్ద ఉంది. ఆ నలుగురి వివరాలు కూడా పోలీసుల వద్ద ఉన్నాయి. వారిని కఠినంగా శిక్షించాలి’ అని రాంప్రసాద్‌ అన్నారు.