
దైవానికి ప్రతిరూపంగా భావించే పూజారి ఆధ్యాత్మికంగా ఉండాల్సింది పోయి మహిళా పోలీసులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉదంతం శుక్రవారం వరంగల్ నగరంలోని వేయిస్తంభాల ఆలయంలో వెలుగు చూసింది. బందోబస్తు నిర్వహిస్తున్న మహిళా ఎస్సైతోనూ దురుసుగా ప్రవర్తించడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.
హన్మకొండ సీఐ దయాకర్ కథనం ప్రకారం: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయంలో పోలీస్ బందోబస్తులో భాగంగా నగరంలోని ఓ మహిళా ఎస్సై వీఐపీ క్యూలైన్ వద్ద బందోబస్తు నిర్వహిస్తోంది . ఈ క్రమంలో పూజారి సందీప్ శర్మ ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. కంగుతున్న మహిళా ఎస్సై, పూజారి వికృత చేష్టలను ప్రశ్నించగా ‘ తాకితే తాకించుకోవాలి, వేయిస్తంభాల ఆలయంలో పూజారులదే నడుస్తది, పూజారులను, తాకితేనే డ్యూటీ వేయించుకోవాలి. లేదంటే రావొద్దని. ‘ దురు సుగా ప్రవర్తించాడు. విధులకు ఆటంకం కలిగించడం తో పాటు అసభ్యంగా వ్యవహరించడంతో ఆవేదనకు గురైన బాధిత మహిళా ఎస్సై కీచక పూజారిపై చర్యలు తీసుకోవాలని హన్మకొండలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది . ఈ ఘటనపై విచారణ జరుపుతు న్నట్లు సీఐ దయాకర్ తెలిపారు .
గతంలోనూ ఇలాంటి ప్రవర్తనే:
గతంలో కార్తీక పౌర్ణమి రోజు బందోబస్తు విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుళ్లతో ఇదే పూజారి సందీప్ శర్మ అసభ్యకరంగా ప్రవర్తించారని పలు వురు మహిళా కానిస్టేబుళ్లు ఆరోపించారు . విధుల్లో ఉన్న వారిని తా కుతూ “మీకు నేను అయ్యగారిని కాదు, అన్నయ్యను కాదు” అని ద్వందార్థాలతో మాట్లాడారని వారు వాపోయారు. వేయిస్తంభాల ఆలయంలోని పూజారుల నిర్వాహకంతో దేవాదాయశాఖ అధికారులు, పోలీసులు, భక్తులు ఇబ్బందులకు గురువుతున్నారని, కీచక పూజారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఉన్నతాధికారులను కోరారు…