సీఎం కేసీఆర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత లోక కళ్యాణం కోసం అనేక దైవిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండలోని వేయ్యి స్తంభాల దేవాలయంలో అతి రుద్రా చండీ యాగా పోస్టర్ ను ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మేయర్ గుండా ప్రకాష్ విడుదల చేసారు.

హన్మకొండలోని వేయి స్తంభాల దేవాలయంలో భవిత శ్రీ చిట్ ఫండ్ ఆధ్వర్యంలో వచ్చేనెల 15 నుండి 21 వరకు అతిరుద్ర చండీ యాగం నిర్వహిస్తున్నారని తెలిపారు. శృంగేరి పీఠాధిపతులతో ఈ యాగం నిర్వహించనున్నారన్నారు. ప్రజల సుఖ సంతోషాల కోసం యాగాన్ని నిర్వహిస్తున్నందుకు భవిత శ్రీ చిట్ ఫండ్ యాజమాన్యాన్ని అభినందించారు.

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కోరారు. 200 మంది వేద పండితులతో యాగాన్ని నిర్వహిస్తున్నామని మేయర్ గుండా ప్రకాష్ అన్నారు. ప్రభుత్వం తరపున అన్ని సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు రానున్నారని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మేయర్ ప్రకాష్ తెలిపారు.