ముంబై లో మరో సెక్స్ రాకెట్ గుట్టురట్టు చేశారు పోలీసులు. రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు ఇంకా ఒక కొలిక్కి కూడా రాకముందే మరో సెక్స్ రాకెట్ లో యువనటి అడ్డంగా దొరికిపోవడం సంచలనం సృష్టిస్తోంది. వివరాలలోకి వెళితే: ముంబైలోని రిచ్ ఏరియా అయినా జుహూ ప్రాంతంలోని ఒక హోటల్ లో పోలీసులు రైడ్స్ నిర్వహించారు. ఈ రైడ్ లో బాలీవుడ్ టీవీ నటి, మోడల్ ఇషా ఖాన్ వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. ఆమె స్వతంగా ఒక వ్యభిచార దందాను నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కొంతమంది యువతులతో కలిసి ఈ రాకెట్ కి తెరలేపినట్లు సమాచారం. ఇప్పటికే ఆమెపై పోలీసులకు అనుమానం ఉన్నా సరైన ఆధారాలు లేక ఆగిపోయినట్లు తెలుస్తోంది.

ఇక ఇటీవలే ఇషా ఇద్దరు అమ్మాయిల ఫోటోలను కొంతమంది డబ్బున్న వ్యక్తులకు పంపి గంటకు లక్ష అంటూ డీల్ కుదుర్చుకుందని తెలుసుకున్న పోలీసులు హోటల్ పై రైడ్స్ నిర్వహించి ఇషాతో పాటు మరో టీవీ నటిని, మోడల్ ని అరెస్ట్ చేశారు. ఇక ఆమె ఫోన్ లో డీల్ సంభాషణ వైరల్ గా మారినట్లు తెలుస్తోంది. గంటకు లక్ష ఇద్దరు అమ్మాయిలకు రెండు లక్షలు అంతకన్నా తగ్గేది లేదు ఆ రూ.2 లక్షల్లో నేను రూ.50వేలు మాత్రమే కమీషన్‌గా తీసుకుంటాను. మిగతా డబ్బు ఆ అమ్మాయిలే తీసుకుంటారని చెప్పింది. అమ్మాయిలను ఎక్కడ కలవాలి అని అడిగితే జుహు హోటల్‌ దగ్గరకు రమ్మని చెప్పింది. ఇక ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.