ఇప్పుడు కరోనా కారణంగా చాలా మంది డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. షూటింగ్స్ కూడా లేకపోవడంతో పొట్టకూటి కోసం నానా తంటాలు పడేలా సినీ కార్మికులు కూడా ఉన్నారు. అయితే అంతా ఒకేలా ఆలోచించరు కదా కొందరు డబ్బు కోసం వక్రమార్గాల వైపు అడుగులు వేస్తుంటారు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది పైగా బయట కనిపించినంత అందంగా సినిమా ఇండస్ట్రీ లోపల ఉండదని చాలా మందికి తెలుసు. వ్యభిచార ముఠాలు ఇక్కడ చాలానే ఉంటాయని ఇదివరకే బట్టబయలైంది కూడా. చాలాసార్లు సెక్స్ రాకెట్స్ బయట పడ్డాయి కూడా. ఇదిలా ఉంటే ఇప్పుడు కూడా ఇదే జరిగింది. వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా ఇద్దరు హీరోయిన్లు దొరికిపోయారు. సినిమా ఇండస్ట్రీలో మోడల్స్, అప్ కమింగ్ హీరోయిన్స్ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. వాళ్లకు డబ్బు కోసం వ్యభిచారం చేయడం తప్ప మరో మార్గమే లేదన్నట్లుగా బ్రెయిన్ వాష్ చేస్తుంటారు కొందరు.

అలాగే ఇద్దరు తమిళ హీరోయిన్లు ముంబైలో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. రైడింగ్‌లో దొరికిపోయిన తర్వాత కూడా వాళ్లు చెప్పిన సమాధానం పోలీసులకు కూడా షాక్ ఇచ్చింది.
సినిమా ఫీల్డులో షూటింగ్స్, మోడలింగ్, ఫోటోషూట్స్ వంటివన్నీ ఆగిపోయాయి. ఆ పనులతో చేతినిండా డబ్బుతో విలాసవంతంగా జీవితాలను గడపటం తమకు అలవాటైపోయిందని కానీ ఇప్పుడు అలాంటివేం లేకపోవడంతో డబ్బులకు చాలా ఇబ్బంది పడుతున్నామని అందుకే ముంబై వచ్చామని చెప్పారు వాళ్లు. అంతేకాకుండా ఎందరో హీరోయిన్స్, మోడల్స్ ముంబై వచ్చి డబ్బులు సంపాదించుకుని వెళ్లారని.. తాము కూడా అలాగే ఇక్కడికి వచ్చామని వాళ్లు చెప్పడం గమనార్హం. వీళ్ళను అరెస్ట్ చేసి పునరావాస కేంద్రాలకు తరలించారు పోలీసులు. డబ్బుల కోసం చూస్తున్న అమ్మాయిల అవసరాన్ని ఆసరగా చేసుకుని కొందరు ఈ ఉచ్చులోకి దించుతున్నారంటున్నారు పోలీసులు. ఇలాంటి వాళ్ళ బలహీనతలను వాడుకుని బిజినెస్ చేస్తున్న దళారులను, వేశ్యాగృహాల యజమానులైన ఇద్దరు మహిళలను కూడా అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు.