ఖమ్మం నగరంలోని కల్వొడ్డు ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంట్లో వ్యభిచారం చేస్తున్నారంటూ స్థానికుల సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సిఐ రవి కుమార్, ఎస్ఐ ప్రసాద్, త్రీ టౌన్ ఎస్సై శ్రీకాంత్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి, రామారావు, సూర్యనారాయణ దాడులు నిర్వహించారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ముగ్గురు మహిళలతో పాటు
ఐదుగురు విఠులను అదుపులోకి తీసుకొన్నారు. కూసుమంచికి చెందిన ఓ మహిళ వివిధ ప్రాంతాల నుంచి యువతులను, మహిళలను తీసుకొచ్చి ఖమ్మంలో వేశ్యాగృహం నడుపుతోందని విచారణలో తెలిసిందని టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు తెలిపారు. చట్టపరమైన చర్యల నిమిత్తం ఖమ్మం 3 టౌన్ పిఎస్‌కు అప్పగించారు…