వరంగల్ తూర్పు నియోజకవర్గం 11వ డివిజన్ మిల్స్ కాలనీ పోలిస్ స్టేషన్ పరిదిలోని ఓసిటి లో నూతనంగా ఏర్పాటు చేసిన 120 సీసీ కెమెరాలను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండా ప్రకాష్ రావు,వరంగల్ పోలీస్ కమీషనర్ డా. రవిందర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి ప్రారంభించారు. ఓ సిటీలో సెంట్రల్ లైటింగ్ ను ప్రారంభించారు. అనంతరం ఓ సిటి వెల్ఫేర్ సొసైటి అద్యక్షుడు బోగు చంద్రశేఖర్ అద్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ శివునికి మూడో కన్ను లాగా ప్రజలకు, పోలీసులకు మూడోకన్ను సీ సీ కెమెరాలు అన్నారు. మారుతున్న టెక్నాలజీలో సీసీ కెమెరాల ద్వారా మొబైల్ కు అటాచ్ చేసుకుని మన ఇంటి వద్ద ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల భద్రతపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు, ఓసిటి వాసులు ఇంత మంచి కార్యాన్ని ముందుకు తీసుకొచ్చిన కుడా చైర్మన్, కాలనీ వాసులు, పోలీస్ లకి ప్రతీ ఒక్కరిని అభినందిస్తున్నానన్నారు. ఓ సిటి అభివృద్దికి అందరూ సహకరించాలి, ఎమ్మెల్యే అదికారిక క్యాంపు కార్యాలయం కూడా ఇక్కడే ఏర్పాటు కాబోతుంది. అఃదకారంగా ఉన్న ఆజంజాయి మిల్ గ్రౌడ్ ను శుభ్రపరిచి అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ ప్రాంతంలో పుట్టిన వాడిగా నాకు ప్రతీ గల్లీ పై అవగాహణ ఉంది. ప్రతీ కాలనీ ని అద్బుతంగా అభివృద్ది చేయాలనేది నా కోరికన్నారు.

అందరు కలిస్తేనే అభివృద్ది జరుగుతుందన్నారు.నాయుడు పంపు వద్ద నుండి ఇంటర్నల్ రింగ్ రోడ్ కు 220 కోట్ల తో ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. ఈ నియోజకవర్గం అద్బుతంగా అభివృద్ది కి ప్రణాళిక బద్దంగా ముందుకెలుతున్నామన్నారు. నియోజకవర్గం మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే కార్యచరణను అతి త్వరలో రూపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు వస్కుల రాదిక బాబు, కుందారపు రాజేందర్,కో ఆఫ్శన్ సభ్యులు షహనాజ్ చాంద్ పాషా,చాంబర్ ఆప్ కామర్స్ అద్యక్షుడు దిడ్డి కుమారస్వామి, ఏసీపీ సారంగపాణి,సీఐలు,ఎస్ ఐ లు, ఓ సిటి రెసిడెన్సియల్ అసోసియోషన్ వరంగల్ ప్రతినిదులు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు..