ఈ రోజు జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో మెదక్ జిల్లా ఎస్.పి. శ్రీమతి చందన దీప్తి ఐ.పి.ఎస్ గారు జిల్లా ప్రజలందరికీ పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ నూతన సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని శుభాకాంక్షలు తెలిపినారు. అలాగే జిల్లా పోలిసు అదికారులకు నూతన సంవత్సరం 2020 సందర్భంగా కేక్ కట్ చేసి ఈ సంవత్సరం లో చేయాల్సిన విధివిదానాల గురించి జిల్లా సిబ్బందికి వివరించడం జరిగింది. ప్రజల రక్షణే ద్యెయంగా జిల్లా పోలీసు యంత్రాగం పని చేస్తున్నదని ముఖ్యంగా ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాల నివారణ,

మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపినారు. అలాగే జిల్లాలో కల ఇతర శాఖలతో సమన్వయంగా పనిచేస్తు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మరింత సేవ చేయాలని, ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించి వారికి మరింత చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యాక్రమాలు చేపడతామని, శాంతి భద్రత పరిరక్షణలో ప్రజలు కూడా తమ వంతు సహాయసహకారాలు అందించాలని కోరినారు.

అలాగే ఎలాంటి సంఘటనలు, అక్రమాలు జరిగినా తమ దృష్టికి తీసుకురావాలని ప్రొఫెషనల్ పోలిసింగ్ తో ప్రజలకు మరింత సేవా చేస్తామని తెలిపినారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు యెస్.పి శ్రీ.డి.నాగారాజు గారు, మెదక్ డి.యెస్.పి పి.కృష్ణమూర్తి గారు, తూప్రాన్ డి.యెస్.పి శ్రీ.కిరణ్ కుమార్ గారు ఎస్.బి సి.ఐ. శ్రీ విజయ్ కుమార్ గారు, జిల్లా పోలిసు అదికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.