శ్రావణ మాసం మొదలు కావడంతో పెద్ద ఎత్తున వివాహాలు జరిగే అవకాశం ఉన్నందున తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని మొగుళ్ళపల్లి తాసిల్దార్ రాణి అన్నారు. కరోనా మహమ్మారి విస్తృతంగా విజృంభిస్తున్న నేపద్యంలో వివాహాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని ఎలాంటి శుభకార్యాలకు అనుమతి ఇవ్వవద్దని ప్రభుత్వం మాకు సూచించిందన్నారు. వివాహ శుభాకార్యలు జరుపుకునేవారు 20 మంది మాత్రమే హాజరయ్యేలా చూడాలన్నారు. ప్రభుత్వం సూచించిన సూచనల ప్రకారం తమ వద్ద దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మండల ప్రజలు వ్యవహరించాలని ఆమె సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తాసిల్దార్ రాణి హెచ్చరించారు