కంగనా నేను శృంగారంలో పాల్గొంటున్నానని తెలిసినపుడు నా తల్లిదండ్రులు షాక్ అంటూ బాలీవుడ్ తార కంగనా రనౌత్ శృంగారంపై తన అభిప్రాయాన్ని మీడియా ముందు బద్దలు కొట్టింది. దేశంలో జరుగుతున్న అత్యాచారాలపై ఇటీవల జరిగిన ఒక సదస్సులో పాల్గొన్న ఆమె శృంగారం పట్ల ఉన్న అపనమ్మకాల గురించి మాట్లాడుతూ తన శృంగారం గురించి కూడా బయటపెట్టింది. ప్రతి ఒక్కరి జీవితంలో శృంగారం ముఖ్యమైన అంశమని తెలిపింది.

మన పవిత్ర గ్రంథాలు శృంగారాన్ని అనుమతించవు. ఇప్పటికీ మన ఆలోచనల్లో పురోగతి కనిపించడం లేదు కానీ, శృంగారం కావాలనిపించినపుడు దానిని ఆస్వాదించాలి, వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. తమ పిల్లలు శృంగారంలో పాల్గొనడం పట్ల తల్లిదండ్రులు ఆనందించాలి. ఒక వయసుకు వచ్చిన పిల్లలు శృంగారంలో పాల్గొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. అయితే శృంగారం విషయంలో పిల్లలు కూడా బాధ్యతాయుతంగా ఉండాలని స్పష్టం చేసింది.