ఒలింపిక్స్‌లో శృంగారం కట్టడికి నిర్వాహకులు వినూత్నమైన చర్యలు చేపట్టారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో క్రీడాకారులు ఒకరితో ఒకరు కలవకుండా శృంగార కార్యకలాపాల్లో పాల్గొనకుండా తక్కువ సామర్థ్యమున్న మంచాలను సిద్ధం చేశారు. క్రీడా గ్రామంలోని అథ్లెట్ల గదుల్లో అట్టలతో తయారు చేసిన మంచాలను వేశారు. ఒలింపిక్స్‌ ముగిసిన తర్వాత ఈ అట్టల్ని రీసైక్లింగ్‌ ద్వారా కాగితపు ఉత్పత్తులుగా మారుస్తారు. ఒక్కో మంచం గరిష్టంగా 200 కిలోల బరువు ఆపుతుందని నిరుడు జనవరిలో నిర్వాహకులు ప్రకటించారు. క్రీడాకారుల మధ్య భౌతిక దూరం ఉండాలన్న ఉద్దేశంతో ఈ మంచాలను తయారు చేయించారు.