క‌రోనా వేళ చాలా వ‌ర‌కు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో ఎవ‌రైనా బ‌య‌ట‌కు వెళ్లాలంటే పోలీసుల నుంచి ఈ-పాస్ పొందాల్సిందే. ఇక కేర‌ళ‌లోని ఓ వ్య‌క్తి ఈ-పాస్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడు. దాంట్లో ఓ చిత్ర‌మైన అభ్య‌ర్థ‌న చేశాడు. శృంగార కోసం బ‌య‌ట‌కు వెళ్లాల‌నుకుంటున్నాను దాని కోసం నాకు ఈ-పాస్ ఇవ్వండి అంటూ ఆ వ్య‌క్తి పోలీసుల్ని కోరాడు. క‌న్నూరులోని ఇరినేవ్ గ్రామ స్థానికుడు ఈ రిక్వెస్ట్ చేశాడు. దీంతో ఖంగుతిన్న పోలీసులు.. అప్లికేష‌న్ పెట్టిన ఆ వ్య‌క్తిని అరెస్టు చేశారు. వాలాప‌ట్ట‌ణం పోలీసులు అత‌న్ని వెతికి ప‌ట్టుకున్నారు. అయితే అక్ష‌ర దోషం వ‌ల్ల త‌న అప్లికేష‌న్‌లో పొర‌పాటు జ‌రిగిన‌ట్లు స‌ద‌రు వ్య‌క్తి పోలీసుల‌కు క్ష‌మాప‌ణ చెప్పాడు.

ఇంగ్లీషులో ‘six o clock’ అని రాయాల‌ని అనుకున్నాన‌ని, కానీ త‌న ద‌ర‌ఖాస్తులో పొర‌పాటున‌ ‘sex’ అని ప‌డిన‌ట్లు తెలిపాడు. ఆ వ్య‌క్తి క్ష‌మాప‌ణ‌ల‌ను స్వీక‌రించిన పోలీసులు.. అన‌వ‌స‌ర కార‌ణాల‌తో ఈ-పాస్ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌ద్దు అంటూ అత‌న్ని రిలీజ్ చేశారు. బీహార్‌లోనూ ఓ వ్య‌క్తి కూడా చిత్ర‌మైన కార‌ణం చూపుతూ.. ఈ-పాస్ ఇవ్వాల‌ని కోరాడు. మొటిమ‌ల చికిత్స కోసం వెళ్లేందుకు త‌న‌కు పాస్ ఇవ్వాల‌ని అత‌ను కోరాడు. దీన్ని బీహార్ పోలీసులు సీరియ‌స్‌గా తీసుకున్నారు.