పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది శ్రీలీల ఆ సినిమా హిట్ కాకపోయినా అమ్మడి చేతిలో ఆఫర్స్ బోలెడు ఉన్నాయి ఇటీవల మాస్ మహారాజ రవితేజ ధమాకా సినిమాలో నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది ధమాకా సినిమా సాంగ్స్ ఈ బ్యూటీ కి బాగా క్రేజ్ తెచ్చిపెట్టాయి. బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల బాలకృష్ణ కూతురుగా కనిపించబోతుంది. అయితే శ్రీ లీలపై రోజురోజుకి పెరుగుతున్న క్రేజ్ కాజల్ అభిమానులను ఎప్పుడు నిద్ర పోనివ్వకుండా చేస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. కాజల్ బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో కాజల్ హీరోయిన్ గా కనిపిస్తుంది అంటే బాలకృష్ణ భార్య పాత్రలో కాజల్ కనిపించనుంది. కాబట్టి శ్రీ లీల కాజల్ కి కూతురుగా కనిపించింది.

ధమాకా సినిమాలో రవితేజను డామినేట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన శ్రీలలా ఇప్పుడు కాజల్ పక్కన కనిపించడం అభిమానులను కలవరపడుతుంది. ఈ మధ్యనే ఒక పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ ఇన్నాళ్లకు మళ్లీ వెండి తెరపై కనిపిస్తుంది. ఈ సినిమా కాజల్ కు చాలా కీలకం కాబోతోంది కానీ ఇలాంటి సమయంలో ఒకవేళ కాజాలను శ్రీ లీల ఈ సినిమాలో డామినేట్ చేస్తే కాజల్ ఏమవుతుందో అని అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే కాజల్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా బాలకృష్ణ సరసన నటించిన ఒప్పుకొని అందరికీ షాక్ ఇచ్చింది. కాగా కాజల్ ఫ్యాన్స్ మాత్రం కాస్త కలవరపాటుకు గురవుతున్నారు. కాజల్ మాత్రం ఈ విషయంలో డేరింగ్ గా ఉంది.