‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రబృందం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో కథానాయకుడు మహేష్‌బాబు, నమ్రత దంపతులు, నటుడు రాజేంద్రప్రసాద్‌, నటి విజయశాంతి, దర్శకుడు అనిల్‌ రావిపూడి, మరో దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్మాతలు దిల్‌ రాజు, ఎన్‌వీ ప్రసాద్‌ తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డుమార్గం ద్వారా వీరు తిరుమలకు చేరుకున్నారు. తితిదే అధికారులు వీరికి స్వాగతం పలికి, బస ఏర్పాట్లు చేశారు.