షాద్‌నగర్‌లో దారుణంగా లైంగిక దాడికి గురై, హత్య చేయబడ్డ మృతురాలికి సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కొత్త పేరు పెట్టారు.

అయితే షాద్‌నగర్ ఘటనలో మృతురాలి ఫోటో, పేరు దావానలంగా వ్యాపించింది. జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. దీంతో తాజాగా ఆమె పేరును ‘దిశ’గా మార్చుతూ సజ్జనార్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి నుంచి ఆమెను దిశగా పిలవాలని, జస్టిస్ ఫర్ దిశగా వ్యవహరించాలని సూచించారు.

ఈ మేరకు మృతురాలి తల్లిదండ్రులను ఆయన ఒప్పించారు. మీడియా కూడా అసలు పేరుకు బదులు జస్టిస్ ఫర్ దిశగా పిలవాలని చెప్పారు. కాగా, ఘటనపై మాట్లాడుతూ: బాధితురాలి పేరు బయటపెట్టవద్దని, అందుకే పేరు మార్చినట్లు ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా, షాద్‌నగర్ ఘటనలో యువతిపై అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసిన సంగతి తెలిసిందే. నలుగురు నిందితులు ఈ దారుణానికి పాల్పడ్డారు. నిందితులు ప్రస్తుతం చర్లపల్లి జైల్లో పోలీసుల రిమాండ్‌లో ఉన్నారు…