బంజారాహిల్స్‌ భూ వివాదం కేసులో షేక్‌పేట తహశీల్దార్‌ సుజాత అరెస్ట్‌ అయ్యారు. ఖలీద్‌ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకున్నట్లు ఆధారాలు లభ్యం కావడంతో ఆమెను అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ఆమెను మూడు రోజులుగా అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసులో రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ నాగార్జున రెడ్డి, బంజారాహిల్స్‌ సెక్టార్‌ ఎస్సై రవీంద్ర నాయక్‌ను ఇప్పటికే అధికారులు రిమాండ్‌కు తరలించారు. తాజా అరెస్ట్‌తో ఆ సంఖ్య మూడుకు చేరింది.