మహిళను దైవసన్నిధిలోకి తీసుకెళ్లి

సంతానప్రాప్తి కోసం ఆలయానికి వచ్చిన ఓ వివాహితపై అర్చకుడు అత్యాచారయత్నం చేయబోయాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా అమరావతిలో జరిగింది. కృష్ణా జిల్లా గొల్లపూడి చెందిన చెందిన దంపతులకు పెళ్ళై ఏళ్ళు గడుస్తున్నా సంతానం కలగలేదు. దాంతో సంతాన ప్రాప్తి కోసం దేవునికి మొక్కుకున్నారు. మంగళవారం ఉదయం అమరావతిలోని ఓ ఆలయాన్ని సందర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకుడి ఆశీస్సులు కోరి అతడి పాదాలకు నమస్కరించారు.

ఈ క్రమంలో సదరు మహిళపై కన్నేసిన అర్చకుడు, సంతానం కలగాలంటే ఒంటరిగా మాట్లాడాలని చెప్పి ఆ మహిళను దైవసన్నిధిలోకి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. అసభ్య పదజాలంతో మాట్లాడుతూ, ఒంటి మీద చేతులు వేయబోయాడని దాంతో తాను కేకలు వేస్తూ అతడి నుంచి తప్పించుకుని పరుగులు తీశానని బాధితురాలు చెప్పారు. అంతేకాదు అర్చకుడు అక్కడి నుంచి పరారయ్యాడని బాధిత మహిళ, ఆమె భర్త గ్రామస్థులకు ఈ విషయం చెప్పి వెళ్లిపోయారు.