2019 సంవత్సరం ముగుస్తున్నసందర్భంగా మెదక్ జిల్లా యెస్.పి. శ్రీమతి చందన దీప్తి ఐ.పి.యెస్ గారు జిల్లా యువతకు ప్రజలకు పలు సూచనలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా SP. గారు మాట్లాడుతూ: వేడుకల పేరిట ఇతరులకు ఇబ్బందులు కలిగించొద్దుని, శృతి మించకుండా వేడుకలను జరుపుకోవాలని, న్యూ ఇయ‌ర్ వేడుకల పేరుతో రచ్చ చేయడం, గొడవలకు దిగడం, అమ్మాయిలను ఏడిపించడం వంటి పిచ్చి పనులు చేస్తే తాట తీస్తామని అలాగే 2020 వేడుకలను డిసెంబర్ 31 రాత్రి 8 నుంచి 1 గంట వరకే జరుపుకోవాలిని, నిర్ణీత సమయం వరకే వేడుకలు జరుపుకోవాలని.

ఈ వేడుకల్లో డీజేలకు అనుమతి లేదుని, అశ్లీలం, అసభ్యం ఉండొద్దని, ఈ వేడుకలను ప్రశాంత పండగ వాతావరణంలో జరూపుకోవాలని, ఈ వేడుకల్లో డ్రగ్స్‌, మత్తుపదార్థాల లాంటి వాటి జోలికి వెళ్లవద్దని ఎవరైనా అలాంటి వాటిని వాడినట్లు తెలిస్తే వారిపైన కటినమైన చర్యలు ఉంటాయని, ఈ వేడుకల్లో ముఖ్యంగా మద్యం తాగి వాహనాలు నడిపి తాగిన మత్తులో కొత్త సంవత్సరం లో సరికొత్త సమస్యలను కొనితెచ్చుకోవద్దని, డిసెంబర్ 31 రాత్రి జిల్లా అంతటా వాహనాల తనిఖీలు జరుగుతాయని ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడిపి పట్టుబడితే వాహనం సీజ్‌ చేసి రూ.10 వేల వరకు జరిమానా విడిస్తామని, నూతన సంవత్సర వేడుకల్లో ప్రతి సంవత్సరం మద్యం మత్తులో ఎంతో మంది తమ విలువైన ప్రాణాలు కోల్పోవడమేకాక ఇతరుల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారని, మెదక్ జిల్లాను జీరో యాక్సిడెంట్ డే, ఇన్సిడెంట్ ఫ్రీ డే’గా జరుపుకోవాలని ఆకాంక్షించారు, అలాగే మైనర్లకు, చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని, ఎవరైనా తాము ఆపదలో ఉన్నామని అనిపిస్తే వెంటనే డయల్‌ 100 కు కానీ తమ దగ్గరలోని పోలీసు స్టేషన్ కి కానీ సమాచారం ఇవ్వాలని,

అలాగే 2020 వేడుకలను రోడ్డు ప్రమాదాలు, దుర్ఘటనలు, అపశృతులు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసులు పలు నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించామని తెలిపినారు.నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి దుర్ఘటనలు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని, వేడుకలు జరిగే ప్రాంతాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలిని, ట్రాఫిక్‌ రద్దీ, జామ్‌లు తలెత్తకుండా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకోవాలిని, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా పార్కింగ్‌ ఏర్పాట్లు చేసుకోవాలిని, అలాగే మహిళలు, పిల్లలను నిర్మానుష్య ప్రాంతాల్లో జరిగే వేడుకలకు పంపొద్దని, తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లలను ఓ కంట కనిపెట్టాలిని,

అలాగే డిసెంబర్ 31న రాత్రి మహిళల భద్రత కోసం షీటీమ్స్ తో ప్రత్యేక బృందాలను రంగంలోకి దించుతున్నామని మహిళల పట్ల ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వారిని అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. వేడుకల సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చే పానీయాలు తాగొద్దని, ఎవరైనా అనుమానాస్పదంగా వ్యవహరిస్తే వెంటనే డయల్‌ 100, లేదా దగ్గరలోని పోలీసు స్టేషన్ కి సమాకారం అందించాలిని, మెదక్ జిల్లా పరిదిలో ఎక్కడైనా సమస్యలు ఎదురైనా అనుమానాస్పద వ్యక్తుల సమాచారం ఉన్నా, వస్తువులు కనపడినా వెంటనే మెదక్ జిల్లా పోలీసు వాట్స్ ఆప్ నెంబర్ 7330671900 కానీ, మెదక్ జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లైనటువంటి 08452223533, 08452221667, లకు ఫోన్‌ చేయాలని సూచించారు. కొత్త సంవత్సరం వేడుకల్లో ఎలాంటి అపశృతి లేకుండా చర్యలు తీసుకుంటామని, ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని నిబంధనలు అతిక్రమించినా,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.