పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాలో టైటిల్ సాంగ్ పాడి కిన్నెర మొగిలయ్య ఎంతో ఫేమస్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇదే తరహాలో మొగిలయ్య టీఎస్ఆర్టీసీ ప్రయాణంపై పాడిన పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆర్టీసీ అధికారులు ఆయనను బస్ భవన్‌కు పిలిపించుకొని సన్మానించారు. ఈ సందర్భంగా మొగిలయ్యకు ఆర్టీసీ అధికారులు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇకపై మొగిలయ్య రాష్ట్రంలో ఏ ఆర్టీసీ బస్సులోనైనా ప్రీగా ప్రయాణం చేసే అవకాశం ఇచ్చారు.

ఆర్టీసీ అధికారుల నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు మొగిలయ్య. ఇదిలా ఉండగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఆయన ఆర్టీసీలో వినూత్న మార్పులు తీసుకువస్తున్నారు. దీంతో ప్రయాణికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.