టాలీవుడ్ నటుడు కల్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన ‘కత్తి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన కథానాయిక సనా ఖాన్. ఈ భామ ఆ తర్వాత ‘గగనం’, ‘మిస్టర్ నూకయ్య’ తదితర చిత్రాలతో అలరించారు. పలు హిందీ, తమిళ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ ప్రపంచానికి దూరం కాబోతున్నానని, ఇకపై నటించనని సనా ఖాన్ ఇటీవల ప్రకటించారు. కాగా ఆమె పెళ్లి చేసుకుని అందర్నీ సర్ప్రైజ్ చేశారు.
గుజరాత్‌కు చెందిన ముఫ్తి అనాస్‌ను ఆమె మనువాడారు. సనా ఖాన్ పెళ్లి కుమార్తె దుస్తుల్లో ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ‘నిఖా ముబారక్’ అని రాసి ఉన్న ఛాకొలెట్ కేక్‌ను సనా ఖాన్, ముఫ్తి కలిసి కట్ చేశారు. కరోనా నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది.