రెవెన్యూ శాఖకు సంబంధించి:

జిల్లాలో రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలు పెండింగులో ఉండకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయం రెవెన్యూ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మండలాల వారీగా భూరికార్డుల నవీకరణ, సాధాబైనామ, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ మొదలగు అంశాలపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 202089 ఖాతాలకుగాను 193952 ఖాతాలు డిజిటల్ సంతకాలు అయినాయని, మిగిలిన 8137 ఖాతాలకు వెంటనే డిజిటల్ సంతకాలు చేయాలన్నారు. నిర్లక్షాన్ని విడి అంకిత భావంతో పెండింగ్ ఖాతాలను పరిష్కరించాలని ఆదేశించారు. ఆధార్ అనుసంధానంలేని 126 ఖాతాలకు వెంటనే ఆధార్ సేకరించి డిజిటల్ సంతకాల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అర్హత కలిగి ఉండి పెండింగులో ఉన్న ఖాతాలకు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.