తెలంగాణ రాష్ట్రానికి చెందిన శనివారం నాటి కరోనా బులెటిన్‌ తాజాగా విడుదలైంది. రోజువారీ కరోనా పాజిటివ్‌ కేసులు, మృతుల సంఖ్య వివరాలను తెలిపే మీడియా బులిటెన్‌ను ఆదివారం ఉదయం, కొత్త రూపంలో విడుదల చేస్తామని ప్రజా ఆరోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా వివరాల ప్రకారం.. శనివారం ఒక్క రోజే 1593 కేసులు నమోదయ్యాయి. మొత్తం 15,654 మందిని పరీక్షించారు. కరోనా బాధితుల్లో 998 మంది కోలుకున్నారు. 8మంది చనిపోయారు. ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో 12,264 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

బులెటిన్‌లో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న హాస్పిటల్స్, బెడ్ల సంఖ్య, ఐసీయూలో ఎంతమంది ఉన్నారు, వెంటిలేటర్లు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ హాస్పిటల్‌లో ఏం జరుగుతుందన్న పూర్తి వివరాలను ఇచ్చారు. బులెటిన్‌లో సమగ్ర వివరాలను అందజేసేందుకు ప్రయత్నించారు. ర్యాపిడ్ టెస్టులు జరుగుతున్న హాస్పిటల్స్ వివరాలు జిల్లాల వారీగా ఉన్నాయి. ఇక అత్య‌ధికంగా జీహెచ్ఎంసీలో 641 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 171 కేసులు, వరంగల్‌ అర్భన్‌ 131, కరీంనగర్‌ 51, మహబూబ్‌ నగర్‌ 38, మేడ్చల్‌ 91, మహబూబాబాద్‌ 29, మంచిర్యాల 27, కామారెడ్డి 36, నిజామాబాద్‌ 32, రాజన్న సిరిసిల్ల 27, సూర్యాపేట 22, సంగారెడ్డి 61 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.

ఉమ్మడి వరంగల్ జిల్లా కరోన కేసుల వివరాలు:

  • వరంగల్ అర్బన్ జిల్లా: 131
  • వరంగల్ గ్రామీణ జిల్లా: 21
  • మహబూబాబాద్ జిల్లా: 29
  • జనగామ జిల్లా: 21
  • జయశంకర్ భూపాలపల్లి జిల్లా: 03
  • ములుగు జిల్లా: 14