విటులకు ఆహ్వానం పలుకుతూ తన భార్య నగ్న దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ఉంచిన భర్తను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మండ్యకు చెందిన వ్యక్తి, మాగడి ప్రాంతానికి చెందిన యువతి ఎలక్ట్రానిక్‌ షాప్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేసేవారు. వీరిద్దరూ 2019లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఏడాదిన్నర కుమార్తె ఉంది. పరప్పన అగ్రహార వద్ద ఉన్న సింగసంద్రలో నివాసం ఉంటున్నారు.

నగ్న వీడియోలు చూసేందుకు అలవాటు పడ్డ ఈ వ్యక్తి భార్య సమ్మతితో ఆమె ముఖం కనిపించకుండా నగ్న దృశ్యాలు రికార్డు చేశాడు. స్నేహితుడి సూచనమేరకు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు. గమనించిన ఓ వ్యక్తి సంప్రదించగా ఇంటికి పిలిపించి భార్యతో లైంగిక చర్యకు అనుమతించాడు. కస్టమర్లు ఒప్పుకుంటే సెల్‌ఫోన్‌లో వీడియో తీసేవాడు. డబ్బు కోసం డిమాండ్‌ చేయకుండా కస్టమర్లు ఇచ్చినంత తీసుకునేవాడని పోలీస్‌వర్గాలు తెలిపాయి.