‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన సినిమా ‘సాహో’. ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం అదిరిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 42 కోట్లకు పైగా షేర్ రాబట్టిన ‘సాహో’ ఓవర్సీస్‌లో వన్ మిలియన్ డాలర్ కలెక్ట్ చేసినట్టు సమాచారం. మన కరెన్సీలో రూ. 8 కోట్లు రాబట్టినట్టు సమాచారం. హిందీ వెర్షన్ విషయానికొస్తే తొలి రోజే 25 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్ హిందీ విషయానికొస్తే మరో రూ.3 కోట్లు వసూలు చేసింది. మిగతా భాషలన్ని కలిపితే తొలిరోజే రూ.100 కోట్ల షేర్ రాబట్టినట్టు సమాచారం. మొత్తంగా బాహుబలితో వచ్చిన ఇమేజ్‌తో ‘సాహో’కు బాక్సాఫీస్‌ దగ్గర ప్రేక్షకులు నిజంగానే సాహో అనిపించేలా కలెక్షన్లు కురిపించారు. మొత్తానికి కలెక్షన్ల విషయంలో ప్రభాస్ ‘సాహో’ మూవీ నిజంగానే సాహో అనిపిస్తోంది.