మంగ్లికి వివాదాలు, తలనొప్పులు తప్పడం లేదు ఇప్పుడైతే ఏకంగా తన కారు మీద దాడి చేశారు ఆగంతకులు, బళ్లారి ఉత్సవాల్లో పాల్టొనడానికి వెళ్లిన మంగ్లిపై దాడి, మున్సిపల్ కాలేజీ గ్రౌండ్స్‌లో తను పాల్గొన్న ప్రోగ్రాం ముగిసి, తిరిగి వెళ్లిపోతుంటే ఈ దాడి జరిగింది కారు అద్దాలు ధ్వంసమయ్యాయి, అంతకుముందు కొందరు మేకప్ టెంటులో జొరబడ్డారు తరువాత రాళ్లు రువ్వారు సమయానికి పోలీసులు రంగప్రవేశం చేసి, వాళ్లను చెల్లాచెదురు చేశారు. మంగ్లి ఇప్పుడు దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ పాటలు పాడుతోంది కన్నడంలో కాస్త ఫ్లుయెన్సీ ఉండటంతో ఆ భాషలోనూ అవకాశాలు వస్తున్నాయి, మొన్నామధ్య చిక్‌బళ్లాపూర్ ఉత్సవాల్లో కూడా పాల్గొని పాటలు పాడింది ఇప్పుడు బళ్లారి ఉత్సవాల కోసం వచ్చింది ఈ సంఘటన జరిగింది 21న రాత్రి

దాడికి కారణాలు స్పష్టంగా తెలియడం లేదు ఆమె కన్నడంలో మాట్లాడకపోవడంతో కొందరు యువకులు ఆమె కారుపై దాడి చేశారని ఓ వెర్షన్ వినిపిస్తోంది ఆమధ్య రెండు మూడు ప్రైవేటు సాంగ్స్ మీద వివాదం తలెత్తింది తరువాత ఎస్వీబీసీ సలహాదారుగా నియమించడం మీద కంట్రవర్సీ నెలకొంది పుష్ప సినిమాలో బాగా పాపులరైన ఊ అంటావా మామా ఊఊ అంటావా పాటను తెలుగులో మంగ్లి చెల్లెలు ఇంద్రావతి చౌహాన్ పాడగా, కన్నడంలో మంగ్లియే పాడింది. జనంలోకి బాగా వెళ్లింది ఆ పాట తనకు కన్నడనాట కూడా అభిమానులు పెరిగారు ఐనాసరే, ఆమె కారు మీద దాడి ఎలా జరిగిందనేది చిన్న మిస్టరీయే విక్రాంత్ రోణలో బాగా హిట్టయిన రా రా రక్కమ్మా కూడా తెలుగులో మంగ్లియే పాడింది కాకపోతే కన్నడంలో పాడింది వేరేవాళ్లు ధమాకా సినిమాలో కూడా జింతాక, దండకడియాల్ పాటలు ఆమె పాపులారిటీని పెంచాయి ఒకవైపు జనంలో అభిమానం పెరుగుతూ ఉంటే, మరోవైపు ఆమె అంటే అసహనం, కోపం కూడా పెరిగిపోతున్నాయి…