రాజస్థాన్ కు చెందిన దంపతులు వారితో పాటు కుమారుడు హైదరాబాద్ లోని బంధువుల ఇంటికి వచ్చారు. హైదరాబాద్ నుంచి తిరిగి రాజస్థాన్‌కి బయలుదేరడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చారు. తన పిల్లాడికి వాటర్ బాటిల్ కోసం వెళ్లిన భార్య తిరిగి రాలేదు. మిస్ అయిందనుకున్న భర్తకు ఊహించని షాక్ ఇచ్చింది. అసలేం జరిగిందంటే: రాజస్థాన్‌లోని జోథ్‌‌‌పూర్ ప్రాంతానికి చెందిన ప్రభుదాస్, రమ్య దంపతులు. వీరికి రెండేళ్ల కుమారుడు ప్రకాశ్ ఉన్నాడు. వీరు ముగ్గురు హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వచ్చారు. తిరిగి రాజస్థాన్ వెళ్లే క్రమంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఒక సంఘటన చోటుచేసకుంది. పిల్లాడికి వాటర్ బాటిల్ తీసుకొస్తానని చెప్పి వెళ్లిన భార్య తిరిగి రాలేదు. ప్రభుదాస్ తన భార్య కోసం ఎంత వెయిట్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. కంగారు పడిన అతను చుట్టుపక్కల వెతికాడు. ఎక్కడా కనిపించకపోవడంతో భార్య మిస్ అయిందని భర్త అనుకున్నాడు. అక్కడ అధికారులను సంప్రదించగా సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను చూశాడు. అందులో తన భార్య చేసిన పనికి అతను షాక్ అయ్యాడు.

ఆ సీసీటీవీలో ఏముందంటే:

అధికారులు చూపించిన ఈ సీసీటీవీల్లో భార్య తన కొడుకును తీసుకొని బయటకు వచ్చినట్లు చూశాడు. వాటర్ బాటిల్ కోసం అంటూ భార్య రమ్య తన కొడుకు ప్రకాష్‌ను తీసుకొని స్టేషన్ నుంచి బయటకు వచ్చింది. ఆమె పిల్లాడితో కలిసి పరుగున వచ్చి ఎవరో బైక్ ఎక్కి వెళ్లినట్లు చెప్పారు. దీంతో వెంటనే భర్త ప్రభుదాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని పారిపోయిన రమ్య కోసం వెతుకుతున్నారు..