సీఎం కేసీఆర్- పీకే కలిసి పనిచేయటానికి ఒప్పందం కుదుర్చుకున్నారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ తో పీకే వరుసగా రెండు​ రోజులుగా మంతనాలు జరుపుతున్న విషయం కూడా తెలిసిందే. దీంట్లో భాంగానే ఆదివారం (ఏప్రిల్ 24,2022) సీఎం కేసీఆర్‌ మరోసారి భేటీ అయ్యారు. పార్టీ గురించి నివేదిక సమర్పించారు. ఆ నివేదికలో ‘పీకే’సే నేతలు ఎవరున్నారోనని గులాబీ నేతలు టెన్షన్ పడుతున్నారు. కేసీర్‌కు ప్రశాంత్‌ కిషోర్‌కు పలు నియోజకవర్గాకుల సంబంధించిన సర్వే రిపోర్టులు అందజేసినట్లు సమాచారం. దీంతో ఎవరికి పీకేయమని గులాబీ బాస్ కు పీకే తెలిపారోనని పలువురు నేతల్లో ఆందోళన నెలకొంది. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టాలని పీకే సీఎంకు ఇచ్చిన రిపోర్టులో ఉన్నట్లుగా తెలుస్తోంది. పీకే భేటీతో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల్లో టెన్షన్‌ మొదలైంది. ముఖ్యంగా ఆదివారం జరిగిన భేటీలో జాతీయ రాజకీయాలపై పీకే సీఎం కేసీఆర్‌తో సుధీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో పీకే టీమ్‌ సర్వేలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సర్వేలో వెల్లడైన విషయాల్లో ఎవరికి స్థానం స్థిరం కానుంది. ఎవరికి ఊస్టింగ్ కానుందో తెలియక గులాబీ నేతలకు మల్లగుల్లాలు పడిపోతున్నారు. అయితే పీకే కాంగ్రెస్‌ పార్టీలో పీకే చేరుతారంటూ వస్తున్న వార్తల క్రమంలో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీతో ముందుకు కొనసాగుతారా? లేదా? అనే విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఇక ఈ భేటీలో ఐప్యాక్‌ టీమ్‌ చేసిన సర్వే రిపోర్టులను టీఆర్‌ఎస్‌ పార్టీకి అందిస్తుందని పీకే కేసీఆర్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. 30 శాతానికి పైగా అభ్యర్థులను మార్చాలని పీకే నివేదికలో ఉన్నట్లుగా సమాచారం. తాను కాంగ్రెస్‌లో చేరిన తన సంస్థ ఐప్యాక్ టీఆర్ఎస్ కోసం పని చేస్తుందని కేసీఆర్‌కు ప్రశాంత్ కిషోర్ తెలిపినట్లు తెలుస్తోంది. జాతీయ రాజకీయాలు, బీజేపీని ఢీకొట్టడంపై ఇద్దరి మధ్య సుదీర్ఘ చర్చ కొనసాగింది. భవిష్యత్తులో మూడో కూటమి ఏర్పాటు చేస్తే కాంగ్రెస్‌ను కూడా కలుపుకుపోవాలనే విషయంపై ఆలోచించాలని కేసీఆర్‌ను ప్రశాంత్ కిషోర్ కోరినట్లు సమాచారం. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఒక్కతాటిపై ఉంటేనే ఆ పార్టీని గద్దె దింపాలని పీకే వివరించారు. ఐప్యాక్‌ తెలంగాణలో వచ్చే ఎన్నికల వరకు టీఆర్ఎస్ కోసం పని చేయనుంది. పీకేతో భేటీ అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్ నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లారు.