సీక్రెట్ గా వ్యభిచారం నిర్వహిస్తున్న భారీ సెక్స్ రాకెట్ ను పక్కా స్కెచ్ తో పట్టుకున్నారు పోలీసులు.ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాష్ర్టం ల‌ఖింపూర్ ఖేరి జిల్లాలోని, స‌ద‌ర్ పోలీస్‌ స్టేష‌న్ ప‌రిధిలోని కొత్వాలి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. త‌ల్లీకొడుకులు కొంత‌కాలంగా వేర్వేరు ప్రాంతాల నుంచి అమ్మాయిల‌ను తీసుకొచ్చి వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్నారు. దీంతో స‌మాచారం అందుకున్న పోలీసులు మంగ‌ళ‌వారం దాడులు నిర్వ‌హించి, ఐదుగురు యువ‌తులు, ముగ్గురు విటుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఓ లేడీ గ్యాంగ్ స్టర్, అమె ఇద్ద‌రు కుమారులు.. అమ్మాయిలను ఇత‌ర ప్రాంతాల నుంచి డిమాండ్ మేర‌కు పిలిపించి వ్య‌భిచారం నిర్వ‌హించే వార‌ని పోలీసులు తెలిపారు. ఆ మహిళతో స‌హా ఐదుగురు యువ‌తులపై కేసు న‌మోదు చేసిన‌ట్లు తెలిపారు పోలీసులు. త‌ల్లీకొడుకులు క‌లిసి కొంత‌కాలంగా ఈ వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్నార‌ని వారిని అరెస్ట్ చేశామని తెలిపారు పోలీసులు.