హైదరాబాద్: విద్యార్థి సునీల్ నాయక్ కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు. సునీల్ కుటుంబంలో అర్హులైన ఒకరికి ఉద్యోగం ఇస్తామని ఆమె ప్రకటించారు. తల్లిదండ్రులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని తెలిపారు. సునీల్ దహన సంస్కారాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తామని చెప్పారు. సునీల్ కుటంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటామని సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయడం లేదని సునీల్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

అతని పరిస్థితి విషమించడంతో హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందాడు. సునీల్ విద్యార్థుల సమస్యలపై పోరాటం చేసేవాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడంలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసి ఈ విషయాన్ని సెల్ఫీ వీడియోలో తెలిపాడు.