డిసెంబర్ 26వతేదీన సూర్య గ్రహణం భారత్ లో ఈ దఫా స్పష్టంగా కనిపిస్తుంది. భారత్ లో ఆరోజు ఉదయం 8.17 నిముషాలకు సూర్యగ్రహణం ప్రారంభమై 9.30నిముషాలకు సంపూర్ణ సూర్యగ్రహణం దర్శనమిస్తుంది. ఆ సమయంలోనే సూర్యుడు అగ్నివలయంలాగా గ్రహణం చుట్టూ కనపడతాడు. 10.57నిముషాలకు గ్రహణం వీడుతుంది. కేరళలోని చెరువుత్తూర్ లో దేశంలో అన్ని ప్రాంతాల్లో కంటే సూర్యగ్రహహణ దృశ్యం సుందరంగా ఉండబోతోంది.

ప్రపంచంలో అతికొద్ది ప్రాంతాల్లో మాత్రమే ఇంత స్పష్టంగా సూర్యగ్రహణం కనిపిస్తుంది. సూర్యగ్రహణం వీక్షించే సమయంలో అద్దాలు లేకుండా కంటితో చూడవద్దని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. సూర్యుడికి, భూమికి మధ్య చంద్రుడు ప్రవేశించడంతో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ ఏడాది సూర్యగ్రహణం, చంద్రుడు సూర్యుడికి మధ్యలో నుంచి అంచులో అగ్నివలయంలాగా కనిపిస్తాడు. భారత్ లోనే కాక, సౌదీ అరేబియా, సుమత్రా, బార్నియో లాంటి ప్రాంతాల్లో కూడా సూర్యగ్రహణం దర్శనమిస్తుంది.