జిల్లాలోని చివ్వెంల మండలం కాశీంపేట వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లున్న ట్యాంకర్ ను వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి కాశీంపేట జంక్షన్ వద్ద వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వైద్యులు వెల్లడించారు. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం బాధితుల వివరాలను సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.