టాలీవుడ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ వద్ద పనిచేసిన అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల ప్రకారంః దుర్గంచెరువులో దూకి ఇటీవల సాయకుమార్‌ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్య చేసుకున్న సాయికుమార్‌ గతంలో పూరి జగన్నాథ్‌ వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసినట్లు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక దుర్గంచెరువులో దూకి సాయికుమార్‌ సూసైడ్‌ చేసుకున్నట్లు మాదాపూర్‌ పోలీసులు వెల్లడించారు.