పోటీలు మంచివే. కానీ అన్ని పోటీలూ మంచివి కావు. పైగా పనికిమాలిన ఆత్మవిశ్వాసం అసలు మంచిది కాదు. తన మగటిమిపై అచంచల విశ్వాసంతో సెక్స్ పోటీలో పాల్గొన్న ఓ రసికుడు ఈ లోకం నుంచి శాశ్వతంగా నిష్క్రమించాడు. ఏడో రౌండ్ పూర్తయ్యాక తాను శృంగారం చేస్తున్న వనిత దేహంపైనే కుప్పకూలిపోయాడు.

నైజారియాలోని లాగోస్ నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో ఈ విషాదం చోటుచేసుకుంది. డేవీ అనే నడి వయస్కుడు, లవ్త్ అనే మహిళతో కలసి ఆ హోటల్లో గది తీసుకున్నాడు. సెక్స్‌లో తనకు సాటి వచ్చేవాడు లేడని డేవీ, తను అంతకంటే ఒక ఆకు ఎక్కువ చదివానని లవ్త్ గొప్పలు పోయారు. సెక్స్ పోటీలో పాల్గొందామని నిర్ణయించుకున్నారు. అలసిపోకుండా ఎవరు ఎక్కువసేపు రాసక్రీడ చేస్తే వారు గెలిచినట్లు అని పందెం కాసుకున్నారు. 50000 నైరాలను(దాదాపు రూ.10 వేలు) టేబుల్‌పై పందెంగా పెట్టుకుని రేసు గుర్రాల్లాగా రాసక్రీడకు దిగారు. డేవీ బరిలోకి దిగి తెగ రెచ్చిపోయాడు. లవ్త్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. కానీ ఏడో రౌండ్ ముగిశాక డేవీ ఊపిరాడక ఒక్కసారిగా ఆమెపైనే కుప్పకూలిపోయాడు. లవ్త్ కంగారు పడిపోయి గదిలోంచి బయటికొచ్చి హోటల్ సిబ్బందికి విషయం చెప్పింది.

వారు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విషయం కనుక్కున్నారు. డేవీ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. పోటీలో పాల్గొని నిక్షేపంగా బతికే ఉన్న లవ్త్‌ను జైలుకు పట్టుకెళ్లారు. ఆమె చెప్పింది నిజమో కాదో, అటాప్సీలో తేలుతుందని పోలీసులు చెబుతున్నారు.