విదేశీ మహిళలను ఎరగా వేసి

సెక్స్ రాకెట్ నడుపుతున్నాడన్న ఆరోపణలపై బాలీవుడ్ ప్రొడక్షన్ మేనేజర్‌ను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ముంబై పోలీసులు ధ్రువీకరించారు. ఇద్దరు ఉజ్బెకిస్థాన్ మహిళలను ఈ సెక్స్ రాకెట్ నుంచి కాపాడినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న ఫోర్ స్టార్ హోటల్ పోలీసులు రైడ్ చేశారు. అక్కడ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న బాలీవుడ్ ప్రొడక్షన్ మేనేజర్ రాజేశ్ కుమార్ లాల్‌ను అరెస్టు చేశారు. ఇద్దరు ఉజ్బెకిస్థాన్ మహిళలను వారి చెర నుంచి విడిపించారు.

గత నెల 23న కూడా అదే హోటల్‌లో సెక్స్ రాకెట్ నడుపుతున్న వాళ్ల నుంచి ముగ్గురు మహిళలను కాపాడామని పోలీసులు చెప్పారు. అక్కడ రాజేశ్ కుమార్ లాల్ సాయంతో ఉజ్బెకిస్థాన్ మహిళ జరీనా ఈ వ్యభిచార రాకెట్ నడుపుతోందన్నారు. విదేశీ మహిళలను ఎరగా వేసిి స్టార్ హోటల్‌కు కస్టమర్లను పిలిపించి ఒక్కొక్కరి దగ్గర రూ.80 వేలు వసూలు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఉజ్బెకిస్థాన్‌లోనే ఉండి జరీనా ఈ రాకెట్ నడిపిస్తున్నారన్నారు. రాజేశ్ కుమార్ లాల్‌పై హ్యూమన్ ట్రాఫికింగ్ సహా పలు కేసులు పెట్టినట్లు చెప్పారు.