లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులకు బాలీవుడ్ హీరో సోనూసూద్ చేసిన సాయం వెలకట్టలేనిది. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి సొంత ఖర్చులతో బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి ఎందరో వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చారు. లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులకు బాలీవుడ్ హీరో సోనూసూద్ చేసిన సాయం వెలకట్టలేనిది. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి సొంత ఖర్చులతో బస్సులు, రైళ్లు, విమానాలు ఏర్పాటు చేసి ఎందరో వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చారు. ఇలా లాక్‌డౌన్‌ వేళ సోనూసూద్ సాయం పొందిన వేలాది మంది వలస కూలీలలో ఒకరు ప్రశాంత్.

కేరళలో చిక్కుకుపోయిన ఇతడ్ని విమానం ద్వారా ఒడిశాలోని తన సొంతూరుకు చేర్చారు. ఇక దానికి కృతజ్ఞతగా ప్రశాంత్ తన కొత్త వెల్డింగ్ షాప్‌కు సోనూసూద్ అనుమతి తీసుకుని ఆయన పేరును పెట్టుకున్నాడు. ”నేను ఎన్నో బ్రాండ్లకు ప్రచారం చేశా, కానీ ఇది నాకు ఎంతో ప్రత్యేకమైంది. నువ్వు ధనవంతుడివి కావాలని కోరుకుంటున్నా బ్రదర్” అని సోనూసూద్ ట్విట్టర్ ద్వారా అతనికి శుభాకాంక్షలు తెలిపారు.